9, నవంబర్ 2017, గురువారం

Mana Natakam 5th Episode



మన నాటకం ఐదవ సంచికలో నేను ప్రస్తావించిన నాటిక రాజువెడలె. రచన, దర్శకత్వం కె.కె.ఎల్. స్వామి. ఒక జానపద కళాకారుని జీవిత శైలికి దర్పణం ఈ నాటిక.

27, అక్టోబర్ 2017, శుక్రవారం

Sai Raghava Movie Makers

MANANATAKAM

MANANATAKAM EPISODE 3 పక్కింట్లో పుట్టండి

ManaNatakam 4th Episode

15, ఫిబ్రవరి 2017, బుధవారం

నాటిక రచనల పోటీ దరఖాస్తు

సాయిరాఘవ మూవీమేకర్స్ (UAN: AP04D0002979)
మేము తెలుగు నాటిక రచనల పోటీని మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాం. భారతీయ సాహిత్యంలో నాటకానికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. భాసుడు, కాళిదాసాది ప్రముఖులు సంస్కృత నాటకాలను రచించి సుప్రసిద్ధులైనారు. ఆయా ప్రాంతీయ భాషలకు చెందిన పలువురు రచయితలు నాటక సాహిత్యంలో చిరస్థాయి నొందారు. తెలుగునాట కూడా అటువంటి రచయితలు అనేకమంది వున్నారు. వారు కొన్ని కారణాంతరాలవల్ల కొన్ని పరిధులకు కట్టుబడి తమ రచనలలో మూసదనాన్ని, భావస్వతంత్ర్యాన్ని వ్యక్తీకరించ లేకపోతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఈ తరుణంలో నాటక రచయితలకు పూర్తి భావస్వతంత్ర్యం ఇస్తూ చదువుకోటానికి, ప్రదర్శించటానికీ వీలుగా వుంటే రచనలను కోరుతుంది మా సాయిరాఘవ మూవీమేకర్స్. ప్రదర్శనాయోగ్యంగా, సరసమైన, హృద్యమైన, వ్యంగ్య, సామాజికాంశాలను ప్రస్ఫుటిస్తూ.. కుల,మత,వ్యక్తిగత వైషమ్యాలను రెచ్చగొట్టని రచనలను ఆహ్వానిస్తున్నాం. అర్హమైన రచనలకు మాకున్నపరిధిలో పట్టాభిషేకం చేయాలని సంకల్పించాం.
నిబంధనలు
1.              ఈ పోటీలకు ఒక రచయిత నుంచి ఎన్ని రచనల నైనా అనుమతిస్తున్నాం.
2.      ప్రతి రచనా ఈ నాటక పోటీలకొరకు రాసినదై వుండాలి. ఎవరైనా మీ రచన పాతదేనని సమాచారం పంపితే సంజాయిషీ ఇచ్చేందుకు ఆ రచయిత సిద్ధంగా వుండాలి.
3.        నాటిక తమ సొంత రచనే అని, దేనికీ అనుకరణ కానీ, అనుసరణ కానీ కాదని, ఒకవేళ అటువంటిదేమైనా జరిగితే సదరు రచయితలు, పబ్లిషర్స్ వగైరాలు తీసుకునే చర్యలకి సంస్థ ఎటువంటి బాధ్యతలూ స్వీకరించదు. మీ సొంత ఖర్చులతోనే పరిష్కరించుకోవలసి వుంటుంది.
4.         రచయితలు నాటక ప్రతిలో ఎక్కడా తమ పేర్లుకానీ, సమాజాల పేర్లుకానీ నమోదు చేయకూడదు. అలా నమోదు చేసినట్లయితే వెంటనే వాటిని అనర్హమైనవిగా భావించి పోటీనుండి తొలగించటం జరుగుతుంది.
నాటికలకు :
              I.            మొదటి బహుమతి     -        15,000 రూపాయలు
            II.            రెండవ బహుమతి     -        10,000 రూపాయలు
          III.            మూడు ప్రోత్సాహక బహుమతులు – 5,000 రూపాయలు అదించుటకు నిర్ణయించాము.
§  రచయితలు రాయవలసిన అంశాలు :
     I.        యువత వ్యవసాయం వైపు మరలాలంటే ఏం చెయ్యాలి ?
   II.        దేశాభివృద్ధిలో యువత ప్రాధాన్యత ?
  III.        ఉమ్మడి కుటుంబం గొప్పదా..? చిన్న కుటుంబం గొప్పదా..? ఎందుకు?
 IV.        అపార్టు మెంట్ కల్చర్.. సమస్యలూ, పరిష్కారాలు
   V.        నోట్ల రద్దు - దేశంపై ప్రభావం..?
 VI.        ఆర్థికంగా దేశం ముందంజలో వుండాలంటే ఏం చెయాలి...?
VII.        గ్లోబలైజేషన్ వల్ల లాభ-నష్టాలు బేరీజు వేస్తూ రచన సాగాలి.
రచయితలకు పూర్తి భావస్వాతంత్ర్యం కలదు. మేమిచ్చిన అంశాలపై మాత్రమే రచనలు కొనసాగించ వలసి వుంటుంది. ఉన్నతమైన విలువలు కలిగిన రచనలకు మాత్రమే అర్హమైనవిగా ప్రకటిస్తాం. ఎంపికైన రచనల వివరాలను వ్యక్తిగతంగా తెలియజేస్తాము. మీరు మీ రచనలను కేవలం ఈ-మెయిల్ ద్వారా మాత్రమే పంపగలరు. ఒకవేళ ఏ రచనలూ కనుక ఎంపిక కాకపోతే పోటీని రద్దు చేసే అవకాశం కలదు. ఈ విషయం కూడా మేము మీడియా ముఖంగా తెలియజేయ గలము. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. న్యాయనిర్ణయంపై వాదప్రతివాదములు ఉండవు. దీనిని గమనించ ప్రార్థన.

అప్లికేషన్ మరియు పూర్తి వివరాలకొరకు కింది చూడండి